![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1013 లో..... ఇంటి ఓనర్ వంటలు చేయమనడంతో రాజు, లక్కీ ఇద్దరు ఇందుని రిక్వెస్ట్ చేసి వంటలు చేయిస్తారు. అప్పుడే కిచెన్ లోకి ఓనర్ వస్తాడు. వంట చేస్తున్న ఇందుని చూసి ఎవరని అడుగుతాడు. దాంతో మత్తులో ఉన్న అతన్ని భ్రమ పడ్డట్టు లక్కీ డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఓనర్ తాగి పడిపోతాడు. ఏం పోసావ్ రా.. వాడు అలా పడిపోతున్నాడని రాజు అనగానే రా సరుకు పోసానని లక్కీ చెప్తాడు.
ఆ తర్వాత మీకు ఇంత హెల్ప్ చేసాను.. నాకు ఒక గోలీసోడా తీసుకొని వస్తారా లేదా అని రాజుతో ఇందు అంటుంది. తీసుకొని వస్తానని రెండు గోలిసోడాలు తీసుకొని వస్తాడు రాజు. దాంతో ఇందు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఒక సాయం చెయ్యాలి.. రేపు ఆ ఓనర్ గాడు లేచేసరికి వాడికి బ్రేక్ ఫాస్ట్ చెయ్యాలని రాజు అనగానే అయితే మీరు నాకొక హెల్ప్ చెయ్యాలని ఇందు అంటుంది. నన్ను సరదాగా అలా బయటకు తీసుకొని వెళ్ళాలని ఇందు అంటుంది. ఏంటి నేను ఏమైనా నీ బాయ్ ఫ్రెండ్ అనుకున్నావా అని రాజు అనగానే నందు బెదిరిస్తుంది. ఇక చేసేదేమీ లేక సరేనని ఇందుని రాజు బయటికి తీసుకొని వెళ్తాడు.
మరొకవైపు వెంకీ కోసం వాళ్ళ ఇంటికి వస్తుంది నందు. మీ అబ్బాయి వెంకీ ఉన్నాడా.. ఈ ఫోన్ నా దగ్గర మర్చిపోయాడని నందు అనగానే పైన ఉన్నాడని వెంకీ వాళ్ళ నాన్న చెప్తాడు. దాంతో నందు పైకి వెళ్లి చూస్తుంది. అక్కడ వెంకీ తాగుతూ కన్పిస్తాడు. ఏంటి వెంకీ ఇలా చేస్తున్నావని నందు అడుగుతుంది. ఇది మందు కాదులే, ఆపిల్ జ్యూస్ ఏదో ఫీల్ ఉంటుందని ట్రై చేసానని వెంకీ అంటాడు. తను ఆ రోజు ఎంత మోసం చేసిందో నందుతో వెంకీ చెప్తాడు. ఆ తర్వాత ఇందుని తీసుకొని రాజు బయటకు వస్తాడు. తనకి ఐస్ క్రీమ్ దొంగతనం చేసి తినడం అంటే ఇష్టమని ఇందు అనగానే రాజు అలాగే ప్లాన్ చేస్తాడు. ఇందు ఐస్ క్రీమ్ దొంగతనం చేసేలా చేసి తను ఐస్ క్రీమ్ తినేలా చేస్తాడు రాజు. తరువాయి భాగంలో ఇందుకి ఇష్టమైనవి అన్ని రాజు చేసేసరికి చాలా థాంక్స్ రాజు అని ఇందు తనని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |